‘3 మంకీస్’ సినిమా ట్రెయిలర్

‘జబర్దస్త్’ కామెడీ ప్రొగ్రామ్ తో తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించిన కమేడియన్లు ఒక్కొక్కరూ హీరోగా మారుతున్నారు. ఇప్పటికే షకలక శంకర్ ఓ సినిమా పూర్తి చేశాడు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ .. కమేడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘3 మంకీస్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ కూడా ఇవాళ విడుదల చేశారు.

కామెడీ, డ్రామా జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను నగేష్ నిర్మిస్తున్నారు.

Loading...