కుర్ర హీరోలతో అజయ్ భూపతి ‘మహాసముద్రం’

ఆర్ ఎక్స్ 100 సినిమాతోనే దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు అజయ్ భూపతి రెండవ సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. రెండవ సినిమాగా ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో ఒక హీరోగా రవితేజను ఎంచుకున్నాడు. రవితేజతో పాటు పలువురు స్టార్స్ ను మహాసముద్రం కోసం సంప్రదించాడు. కానీ ఎవ్వరు ఒకే కాకా పోవడంతో సినిమా ఆలస్యమైంది .

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. కొత్త వారితోనే సినిమా చేయాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అందుకు గాను కార్తికేయ మరియు విశ్వక్ సేన్ లను ఎంపిక చేసుకున్నాడట. వీరిద్దరు కూడా అజయ్ భూపతి చెప్పిన మహాసముద్రం స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అతి త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుంది. మొదటి సినిమాలానే ‘మహాసముద్రం’ చిత్రాన్ని కూడా అంతే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించి మాస్ ఆడియన్స్ ను అలరించబోతున్నాడట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజులో అలరిస్తుందో చూడాలి.

Loading...