అల వైకుంఠపురములో ఖాతాలో రికార్డ్

అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురములో ఖాతాలో నాన్-బాహుబలి రికార్డు నమోదైంది. ‘జులాయి’, ‘s/o సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది. అభిమానులకు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ మధ్యే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫలితంగా నిజాం ప్రాంతంలో రికార్డు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల గణాంకాల ప్రకారం.. అల వైకుంఠపురములో సినిమాకు ఆదివారం నాడు వచ్చిన రూ. 2.25 కోట్ల షేర్స్‌తో కలిపి… నిజాం ప్రాంతంలో తొలి 15 రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ 40+ కోట్ల షేర్ మార్కుని చేరుకుంది. బాహుబలి చిత్రాల తర్వాత నిజాంలో రూ. 40 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం ఇదేనని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలా చూసుకుంటే అల వైకుంఠపురములో సినిమా బాహుబలియేతర రికార్డు సాధించిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం సినిమా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతున్నందు వల్ల.. త్వరలోనే అల వైకుంఠపురములో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవచ్చునని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే జంటగా నటించగా.. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, సముద్రఖని, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు

Loading...