అల్లు అర్జున్‌కి కేరళ సర్కార్ ప్రత్యేక గౌరవం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాలీవుడ్‌లోనూ బన్నీ డబ్బింగ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే అల్లు అర్జున్‌కి సైతం కేరళ పట్ల ప్రత్యేక గౌరవం ఉంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ని కేరళలో జరుగుతున్న 66వ నెహ్రూ ట్రోఫి బోట్ రేసింగ్ పోటీలకు ఆ రాష్ట్ర సర్కార్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

ఇవాళ ఉదయం అల్లు అర్జున్ జండా ఊపి ఆ పోటీలను ప్రారంభించారు. తన భార్య స్నేహా రెడ్డితో సహా వెళ్లిన అల్లు అర్జున్‌కి కేరళలో ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానుల మధ్య ఆ పోటీలను ప్రారంభించిన అనంతరం.. తనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కేరళ ప్రభుత్వానికి, కేరళ వాసులకు అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

Loading...