విజయ నిర్మల భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులు

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం నానక్‌రామ్‌గూడలో అలనాటి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడే విజయ నిర్మల భౌతికకాయానికి నివాళి అర్పించి కృష్ణ, నరేష్‌తోపాటు వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.

వైఎస్ జగన్ వెంట వెళ్లి విజయనిర్మలకు నివాళి అర్పించిన వారిలో వైఎస్సార్సీపీ అగ్ర నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి విజయసాయి రెడ్డి ఉన్నారు. అదే సమయంలో బీజేపి అగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా విజయ నిర్మల భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వారు కూడా కృష్ణను పరామర్శించి ఓదార్చారు.

Loading...