బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్

బాలయ్య తన తండ్రి వారసత్వాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించాడు. జూ. ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ బయటకు వచ్చింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ కారులో ప్రయాణిస్తూ అభిమానుల కంట పడ్డాడు. ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ గతంలో కంటే కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తున్నాడు. హీరోకు కావలసిన ఆ రాజసం, ముఖంలో మెరుపు మోక్షజ్ఞలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోక్షజ్ఞ లుక్ చాలా బావుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అవసరమైన నటన, డాన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Loading...