ఆ ముగ్గురిలోనే… బిగ్‌బాస్ చాంపియ‌న్‌?

బిగ్‌బాస్ సీజన్ -3, మొత్తం 17 మంది కంటెస్టెంట్ల‌తో మొదలైన ఈ షోలో ఐదుగురు సభ్యులు ఫైనల్ కు చేరుకున్నారు. ఖ‌చ్చితంగా ఫైనల్‌కు వెళుతుందని అందరూ భావించిన శివజ్యోతి ఎలిమినేట్ కాగా… ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి … రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా అనూహ్యంగా ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీ ఉన్నారు. వీరిలో ఒక‌రు బిగ్‌బాస్ చాంపియ‌న్ కానున్నారు.

ఇక చివ‌రి వారం షోలో ఎవ‌రు బాగా ఆడ‌తారో ? ఎవ‌రు ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకుంటారో ? వారే విన్న‌ర్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఈ వారం హౌస్‌లో ట్విస్టులు చాలానే ఉండ‌నున్నాయ్‌. ఈ వారం బిగ్ బాస్ ఆడించే గేమ్ బట్టే కంటెస్టంట్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. బిగ్‌బాస్ త‌ల‌చుకుంటే ఎవ‌రైనా బ్యాడ్ అవుతారో ? ఎవ‌రైనా గుడ్ అవుతార‌న్న‌ది తెలిసిందే.

ఇక హౌస్‌లో ఉన్న ఐదుగురిలో అంచ‌నాలు, సోష‌ల్ మీడియా ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ ల్లో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వరుణ్, అలీ పట్ల ప్రేక్షకుల్లో అంత అంచనాలు లేవు. అలీ రీ ఎంట్రీతో వ‌చ్చినా క్రేజ్ త‌గ్గ‌డంతో పాటు బిహేవియ‌ర్‌లో తేడా వ‌చ్చింది. వ‌రుణ్ టాస్క్‌ల‌లో చాలా వీక్‌. చివ‌ర్లో వితిక కోసం ఆడిన డ్రామాల‌తో రేసులో వెన‌క‌ప‌డిపోయాడు.

ఇదే టైంలో ముందు నుంచి వీక్‌గా ఉన్న రాహుల్ చివ‌ర్లో అనూహ్యంగా పుంజుకున్నాడు. బాబా పోటీలో ఉన్నా కానీ శ్రీముఖి, రాహుల్ మధ్య గట్టి పోటీనే జరగనుంద‌ని తెలుస్తోంది. మ‌రి చివ‌ర్లో అంచ‌నాలు ఎలా తారు మారు అవుతాయో ? చూడాలి.

Loading...