జగన్ తో దగ్గుబాటి భేటీ..వైసీపీలోకి దగ్గుబాటి కుటుంబం

ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ మార్పు చెందుతున్నాయి. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పలు కీలక మార్పులు.. నాయకుల చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాం కలిసి జగన్ తో భేటీ అయ్యారు.

అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమాచారంఅందుతుంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి హితేష్ చెంచురాంను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ బీజేపీ కీలక నేతగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి.. భర్త, కుమారుడు వైసీపీ అధినేతను కలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు.. పురంధేశ్వరి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ సమయంలో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనేది వేచి చూడాలి.

Loading...