రోబో 2.0 తో కల నేరవేరింది అన్న దర్శకుడు శంకర్

“2.0” సినిమాతో తన కల నిజమైందని ప్రముఖ దర్శకుడు శంకర్‌ అన్నారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ హీరోగా, ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించడంతో ఈ చిత్రం పట్ల అభిమానుల్లో మరింత హైప్ పెంచిందని అన్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. 4డీ సౌండ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, థియేటర్లలో సీటు కింద స్పీకర్‌ ఉన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుందని అన్నారు.

ఇది తన కలని, ఇప్పుడు సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి సహాయంతో అది నిజమైందని శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మాట్లాడుతూ..‘నా అభిమాన నటుడు రజనీకాంత్‌. ఆయన అందరికీ స్ఫూర్తి. ఈ వయసులోనూ ఆయన వృత్తిపట్ల చూపించే అంకితభావం నన్నెంతో మెప్పించింది. ఈ సినిమా కోసం ఆయన 18 కిలోల బరువున్న సూట్‌ ధరించారని అన్నారు

ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదని, ఆన గొప్ప శాస్త్రవేత్త కూడా అంటూ కితాబిచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు అక్షయ్. ఈ సినిమా కోసం అనేక సవాళ్లు ఎదుర్కొన్నా అని అన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్‌‌, హీరో రజనీకాంత్ లకు ధన్యవాదాలు తెలిపారు.

తన 28 ఏళ్ల సినీ కెరీర్లో వేసుకున్న మొత్తం మేకప్‌ ఈ ఒక్క సినిమాలో వేసుకున్నా. మేకప్‌ తర్వాత ఆ పాత్రలో తనను తాను చూసుకుని షాకైపోయానని అన్నారు. మేకప్‌ వేసుకోవడం కోసం మూడు గంటల సమయం పడితే, తీయడానికి గంటన్నర సమయం పట్టేదని చెప్పారు. ఓ చారిత్రక చిత్రం కోసం పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Loading...