బసిరెడ్డి’గా జగపతిబాబు అసాధారణ నటన

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నవాళ్లు .. జగపతిబాబు నటనకి వన్స్ మోర్లు చెబుతున్నారు. ఇంతవరకూ జగపతిబాబు చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో, ఈ సినిమాలోని ‘బసిరెడ్డి’అనే ఫ్యాక్షన్ లీడర్ పాత్ర ముందువరుసలో నిలుస్తుందని అంటున్నారు.

‘బసిరెడ్డి’గా బాడీ లాంగ్వేజ్ లోను .. డైలాగ్ డెలివరీలోను ఆయన చూపిన వైవిధ్యం అదుర్స్ అని చెబుతున్నారు. రాయలసీమ యాసలో జగపతిబాబు డైలాగ్స్ చెప్పినతీరు .. కొత్త లుక్ తో పలికించిన హావభావాలు అద్భుతం అని అంటున్నారు. ఇంతవరకూ ఏ ఫ్యాక్షన్ సినిమాలోనూ ఈ తరహా విలనిజం కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది. నటుడిగా జగపతిబాబులోని కొత్త కోణాన్ని ఈ సినిమా బయటికి తీసుకువచ్చిందని అంటున్నారు. విలన్ గా జగపతిబాబు జోరు మరికొన్నాళ్ల పాటు కొనసాగడానికి ఈ సినిమా దోహదపడిందని చెప్పుకుంటున్నారు.

Loading...