సీటీమార్ ఫస్ట్ లుక్ పోస్టర్

గోపీచంద్ అప్‌కమింగ్ సినిమా సీటీమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తుండగా దిగంగనా సూర్యవంశి మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. యూ టర్న్ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ చిత్ర నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. భూమిక, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అన్నపూర్ణమ్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నట్టు నిర్మత శ్రీనివాస చిత్తూరి తెలిపారు.

సీటీమార్ సినిమాలో గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డి కోచ్‌లుగా కనిపించనున్నారు. కబడ్డి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Loading...