నాని నిర్మాతగా ‘హిట్’ టీజర్

‘అ’ అనే వైవిధ్యమైన సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని. నిర్మాతగా తొలి సినిమాతోనే తన టేస్ట్ చూపించడంతో పాటు సక్సెస్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్‌తో కలిసి ‘హిట్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు నాని.

ఈ సినిమా టీజర్‌ను హిట్ ప్రొడ్యూసర్ నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా రుహానీ శర్మ నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి కొలను శైలేష్ దర్శకత్వం వహించారు.

Loading...