ప్రియురాలు ఇషా నేగితో వికెట్ కీపర్ రిషబ్ పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ తన ప్రియురాలు ఇషా నేగితో కలిసి మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాలితో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేసిన రిషభ్.. ‘‘నేను నీతో ఉన్నప్పుడే నన్ను నేను బాగా ఇష్టపడతాను’’ అని క్యాప్షన్ పెట్టి ఆరెంజ్ రంగులో ఉన్న హృదయాకారపు ఎమోజీని జోడించాడు.

అదే ఫొటోను ప్రియురాలు ఇషా నేగి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసి ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయని క్యాప్షన్ తగిలించింది. గతేడాది జనవరిలో పంత్ తన ప్రియురాలు ఇషా నేగిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. ‘‘నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా.. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని అందమైన క్యాప్షన్ తగిలించాడు.

Loading...