పవన్ కి ఓటేసి వేస్ట్ చేయకండి.. జీవితా రాజశేఖర్!

వైసీపీ అధినేత జగన్ ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని సినీ నటి జీవితా రాజశేఖర్ అంటున్నారు. సోమవారం నాడు వైసీపీలో రాజశేఖర్, జీవిత దంపతులు జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు.

జగన్ ని ఓడించడానికి వేర్వేరు పార్టీలను సృష్టించారని, ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ పార్టీలనీ ఒక చోటుకి చేరిపోతాయని పరోక్షంగా టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని, ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు.

ఒకవేళ వీరికి ఓటేస్తే.. జగన్ కి వచ్చే మెజారిటీ తగ్గిపోతుందని.. ఒకసారే కదా అని పవన్ కళ్యాణ్ కి వేద్దాం, కేఏ పాల్ కి వేద్దామని ఓట్లు వేస్ట్ చేయొద్దని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల సందర్భంగా వీలైనన్ని చోట్లకి వెళ్లి జగన్ కి ఓటేయమని ప్రచారం చేస్తామని చెప్పారు.

ఓదార్పు యాత్ర, పాదయాత్ర అంటూ ఈ పదేళ్లు జగన్ జనంతోనే ఉన్నారని, తిండి, నిద్ర మానేసి 24 గంటలు జనం మధ్యనే గడిపారని అన్నారు. ప్రజలు జగన్ కి ఓటేసి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు.

Loading...