మహేశ్ ఖాతాలో మరో రికార్డు

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు ట్విట్టర్‌ ఖాతాలో ఫాలోవర్లు 7మిలియన్లకు చేరారు. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా అరుదైన రికార్డును సృష్టించాడు. కాగా 7.83మిలియన్ల ఫాలోవర్లతో కోలీవుడ్ హీరో ధనుష్ దక్షిణాదిన టాప్‌గా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఇందులో ఆయన సరసన పూజాహెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading...