విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో గా చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకున్న మహేష్ బాబు

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన “మీకు మాత్రమే చెప్తా” ట్రైలర్ లాంఛ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ : ” ఈ కాంబినేషన్ కొత్త గా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్త గా అనిపించింది. పెళ్ళి చూపులు నాకు బాగా నచ్చిన సినిమా, విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీం అందరికీ అల్ ద బెస్ట్” అన్నారు.

నిర్మాత గా వ్యవహరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ : “ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి నేనే ప్రొడ్యూస్ చేసాను. నిర్మాత బాధ్యతలు మా నాన్న గారు వర్ధన్ దేవరకొండ తీసుకున్నారు. నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు గారు ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా అందంగా ఉంది. అడగగానే సపోర్ట్ చేసిన మహేష్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా నా మనసుకు నచ్చిన సినిమా, ట్రైలర్ మీకు బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. ” అన్నారు.

Loading...