ఉగాది రోజున మహేష్ మహర్షి టీజర్

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమా నుండి స్పెషల్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఉగాది రోజున మహర్షి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి అని సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశారు. ఉగాది రోజున ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్న మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ చోటి చోటి బాతె ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. ఉగారి రోజున రిలీజ్ అవబోతున్న టీజర్ లో రెండు భారీ డైలాగ్స్ ఉన్నాయట. మరి మహేష్ మహర్షి ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Loading...