జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన హీరో దంపతులు

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా గెలిచినా వైఎస్ జగన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా తెలంగాణా సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

ఈ వేడుకకు మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. గురువారం ఉదయమే విజయవాడ చేరుకున్న విష్ణు తన భార్య విరానికతో కలిసి ఇందిరాగాంధీ స్టేడియంకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యి జగన్ ఇంటికి వెళ్లే వరకు విష్ణు దంపతులు స్టేడియంలోనే ఉన్నారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన వైసీపీ అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో కొన్ని ఏరియాల నుండి ప్రచారం కూడా చేశారు.

Loading...