“మా” యుద్ధం డేట్ ఫిక్స్…

`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడి ఎన్నిక‌పై ఎట్ట‌కేల‌కు ఓక్లారిటీ వ‌చ్చింది. ఏక‌గ్రీవంగా ఎంపిక చేస్తారా? ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? అన్న‌దానిపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కే మా నిర్ణ‌యించిన‌ట్లు తాజాగా మాలో కీల‌క పాత్ర‌ధారి అయిన బెన‌ర్జీ తెలిపారు. మార్చి 10న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని మా వ‌ర్గం భావిస్తున్న‌ట్లు హింట్ ఇచ్చారు. అ తేదీనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని…ఆ తేది నుంచి మొద‌లుకుని ఎప్పుడైనా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అంటే స‌రిగ్గా నెల రోజుల‌కు పైగా స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే `మా` సీటు పై క‌న్నేసిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ పోటీ బ‌రిలోకి దిగైనా గ‌ద్దే ఎక్కుతాన‌ని స‌వాల్ విసిరారు.

అటు ప్ర‌స్తుత అధ్జ్ఞ‌క్షుడు శివాజీ రాజా మూడ‌వ‌సారి ఎన్నిక‌లై హ్యాట్రిక్ కొట్టి స‌త్తా చాటుతాన‌న్ని న‌మ్మకాన్ని వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌లు యుద్ధ వాతావ‌ర‌ణం త‌ల‌పించడం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఆ మ‌ధ్య మా నిధుల విష‌యంలో గోల్ మాల్ జ‌రిగింద‌ని న‌రేష్ ఆరోపించిన నేప‌థ్యంలో రెండు వ‌ర్గాలు గా చిలీపోయి..పెద్ద‌ల ఎంట్రీతో స‌మ‌స్య‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. కానీ లోలోప‌ల న‌రేష్ ఇంకా ర‌గిలిపోతూనే ఉన్నాడ‌ని ఇటీవ‌ల ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. శివాజీ వ‌ర్గం ఆయ‌న్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేసినా క‌న్వెన్స్ అయ్యే అవ‌కశాలు ఏ మాత్రం లేవ‌ని మా స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ఎన్నిక‌లు లేకుండా ఏక‌గ్రీవంగా ఎవ‌రో ఒక‌ర్నీ ఎంపిక చేయాల‌న్నా! న‌రేష్ అడ్డు తగిలేలా ఉన్నాడ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మార్చి 10న ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద వాతావ‌ర‌ణ‌మే మారిపోనుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో రాజేంద్ర‌ప్రసాద్, జ‌య‌సుధ ప్యాన‌ల్స్ పోటీ ప‌డిన‌ప్పుడు ఆ ఎన్నిక‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడిని త‌ల‌పించాయి. అప్ప‌టికి రెండు వ‌ర్గాల మ‌ధ్య ఎలాంటి వివాదాలు లేన‌ప్ప‌టికీ కుర్చీ కోసం ఒక‌ర్రీ ఒకర్ని ఒక‌రు దూషించుకున్న తీరు చూసి అంతా ముక్కున వేలేసుకోవాల్సి వ‌చ్చింది. అస‌లే లోలోప‌ల ర‌గిలిపోతున్న శివాజీ, న‌రేష్ లు ఈసారి ఏకంగా ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వ‌డంతో మ‌రింత ర‌స‌కంద స‌న్నివేశం చోటు చేసుకోబోతుంద‌ని తెలుస్తోంది.

Loading...