పబ్‌లో తాగుతూ మాట్లాడుకుందాం: విజయ్ దేవరకొండకు నాగ చైతన్య వెల్‌కం

అక్కినేని నాగ‌చైత‌న్య, నిధీ అగ‌ర్వాల్ జంట‌గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సవ్యసాచి’ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరై తొలిసారి నాగ చైతన్యను అన్నపూర్ణ స్టూడియోలో జోష్ మూవీ వర్క్ షాపులో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనే ఆశ ఉండేదని, నాగ చైతన్య చాలా చిల్ పర్సనల్ అంటూ ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాగచైతన్య మాట్లాడుతూ “ఇక్కడికి వచ్చిన మిస్టర్ రౌడీకి థాంక్యూ సో మచ్. నువ్వు నీ స్టోరీ చెబుతుంటే.. ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. త్వరలో పబ్‌లో క‌లిసి ఒక మంచి డ్రింక్‌ తాగుతూ మాట్లాడుకుందాం… అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి నాగ చైతన్య చిల్లింగ్ వెల్ కం చెప్పారు.

అక్కినేని అభిమానులంతా కేవలం ఫ్యాన్స్ కాదు మీరంతా మా కుటుంబం. ఇది తాతగారు ప్రారంభించిన జర్నీ. అక్కడ మీరు అందుకున్నారు. నాన్నకి సపోర్ట్ ఇచ్చారు. అఖిల్‌కి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇచ్చారు. సుశాంత్, సుమంత్.. అందరికీ ఇచ్చారు. జనరేషన్స్ మారుతున్నాయి కానీ.. మీ సపోర్ట్ మారలేదు. ఇంకా పెరుగుతూ ఉంది. థాంక్యూ. కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని డిజప్పాయింట్ ఇస్తా. కొన్ని కొన్నిసార్లు ఎనర్జీ ఇస్తా. కానీ వాటితో సంబంధం లేకుండా మనమంతా ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలి. అభిమానులకు అభిమానులు మా అక్కినేని అభిమానులు. ప్రతి సినిమా మీకు నచ్చాలనే సిన్సియర్‌గా చేస్తాను… అంటూ నాగ చైతన్య వ్యాఖ్యానించారు.నాకంటే ఎక్కువ ఈ సినిమాకు చందూ మొండేటి సిన్సియ‌ర్‌గా చేశాడు. సినిమా ఒక యూనిక్ పాయింట్ చుట్టూ తిరుగుతున్నా కావలసిన కమర్షియల్ ఎలెమెంట్స్ అన్ని యాడ్ చేసి ఒక అల్ రౌండ్ మూవీ చేశాడు. ‘ప్రేమమ్’ అనే లవ్ స్టోరీతో మిమ్మల్ని ఎలా ఎంట‌ర్‌టైన్‌ చేశాడో…’సవ్యసాచి’ అనే ఒక కమర్షియల్ మూవీతో అలాగే మిమ్మల్ని ఎంట‌ర్‌టైన్‌ చేయబోతున్నాడు. ఈ విషయంలో నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది… అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

Loading...