అర్జునుడి గెటప్ లో నాగచైతన్య

ప్రేమమ్ మూవీ తర్వాత నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సవ్యచాచి’. ఈ మూవీతో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీతో మాధవన్ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో మాధవన్ పాత్ర కీలకం అని చెబుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో నాగ చైతన్య వాళ్ల నాన్న నాగార్జున హీరోగా నటించిన ‘అల్లరి అల్లుడు’ మూవీలో ఉన్న నిన్ను రోడ్డు మీద లగాయిత్తు పాటను రీమిక్స్ చేశాడు.సవ్యసాచి’ మూవీని తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘తెరకెక్కించారు. మన ఇతిహాసాల్లో రాముడు, అర్జునుడు మాత్రమే రెండు చేతులతో బాణాలు సంధించి సవ్యసాచి అనిపించుకున్నారు. అదే తరహాలో రెండు చేతుల్లో సమాన బలమున్న వ్యక్తి పాత్రలో నాగ చైతన్య ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఒకే శరీరం కలిగిన కవల స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు.

తాజాగా ఈ మూవీ నుంచి ‘సుభద్ర పరిణయం’ అంటూ కామెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు ‘సవ్యసాచి’ మూవీ యూనిట్. ఈ టీజర్‌లో చైతూ తప్పించి మిగతా ఆర్టిస్టు పేల్చిన డైలాగులు బాగున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో మన ప్రేక్షకులు ఈ తరహా కామెడీని చూసి ఎంజాయ్ చేశారు.

ఏదో ‘సవ్యసాచి’ టైటిల్ పెట్టారని ఈ మూవీలో నాగచైతన్యతో అర్జునుడి గెటప్ వేయించి ఈ కామెడీ ట్రాక్‌ను ఇరికించినట్టు పెట్టారు. ఈ గెటప్‌ చైతూకు ఏమాత్రం సూట్ కాలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ‘సవ్యసాచి’ మూవీ నుంచి కామెడీ టీజర్‌ను రిలీజ్ చేసి ఈ సినిమా వాళ్లు ఆడియన్స్‌లో కామెడీ అయిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు ‘సవ్యసాచి’ మూవీ ఎలాంటి రిప్లై ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.

Loading...