నాగశౌర్య ‘అశ్వ‌థ్థామ’

హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు.

ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్‌ను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి మాట్లాడుతూ… ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.3 టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కోసం పండ‌గ‌రోజు ఛ‌లో సెంటిమెంట్‌తో మిమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌లవ‌డం జ‌రిగింది. నాగ‌శౌర్య‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అశ్వ‌థ్థామ‌ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశాము. టాకీ పార్ట్ మొత్తం పూర్త‌యింది. ఈ చిత్రానికి ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్‌.లో కొన్ని ఇంగ్లీష్ మూవీస్‌కి వ‌ర్క్ చేశారు. ఛ‌లో చిత్రం నుంచి శౌర్య‌తో క‌లిసి ట్రావెల్ చేశాడు. క‌థ శ‌ర్య రెడీ చెయ్య‌గా వీరిద్ద‌రు క‌లిసి ఈ చిత్రానికి వ‌ర్క్ చేశారు. డి.ఒ.పి.మ‌నోజ్‌రెడ్డి కూడా యు.ఎస్‌.లో వ‌ర్క్ చేశారు. త‌ను కూడా ఒక సంవ‌త్స‌రం నుంచి మాతో క‌లిసి ప‌ని చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌చ‌ర‌ణ్‌పాకాల, ఎడిట‌ర్ గ్యారీ గ‌తంలో క్ష‌ణం, గూఢాచారి, ఎవ‌రు చిత్రాల‌కు ప‌ని చేశారు. మేమంద‌రం క‌లిసి ఒక టీమ్ వ‌ర్క్‌లా ప‌ని చేసి మంచి అవుట్‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. కె.జి.ఎఫ్ చిత్రానికి స్టంట్స్‌ చేసిన అన్‌భైర‌వ్ మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. మూవీకి సంబంధించి యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక్క పాట మిన‌హా షూట్ మొత్తం పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రిలో ఆ సాంగ్ మీ ముందుకు తీసుకొస్తాం.

Loading...