నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు అంటున్న చైతు

సరిగ్గా పాతికేళ్ల క్రితం విడుదలైన అల్లరి అల్లుడులో నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాట అప్పట్లో బ్లాక్ బస్టర్. కీరవాణి హుషారైన ట్యూన్ కి రమ్య కృష్ణ స్పెషల్ క్యామియోలో నాగార్జున స్టెప్స్ ఓ రేంజ్ లో పేలాయి. ఒరకరంగా చెప్పాలంటే అప్పటి దాకా ఒక స్టైలిష్ ఇమేజ్ ఉన్న నాగ్ ని పూర్తి స్థాయి మాస్ హీరోగా ప్రెజెంట్ చేసి సక్సెస్ అయిన సినిమాల్లో అల్లరి అల్లుడిది ప్రత్యేక స్థానం. ఇన్నేళ్ల తర్వాత అదే పాటను సవ్యసాచి కోసం రీమిక్స్ చేసారు కీరవాణి. ఇటీవలే రిలీజైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా వీడియో ప్రోమో కూడా విడుదల చేసారు. అభిమానులకు మాంచి హుషారు ఇచ్చేలా ఉన్న ఈ పాట ట్యూన్ అదే అయినప్పటికీ పదాల్లో చిత్రీకరణలో చాలా వైవిధ్యం చూపించాడు చందు మొండేటి.

ఇందులో ప్రధానంగా ఆకట్టుకుంది నాగ చైతన్య స్టెప్స్. మంచి ఈజ్ తో ఆకట్టుకునేలా చేసాడు. సాధారణంగా చైతు స్టెప్స్ కిరాక్ అనిపించేలా ఉండవు. అందుకే ఆ మార్క్ తుడిచే ప్రయత్నం ఈ పాటలో గట్టిగా చేసాడు. నిధి అగర్వాల్ అందంగా గ్లామరస్ గా బాగుంది. సవ్యసాచి ప్రధాన ఆకర్షణలో ఈ పాటని ఒకటిగా చెబుతున్నారు. శుక్రవారమే విడుదల ఉన్న నేపథ్యంలో చైతు ఫ్యాన్స్ దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. మాధవన్ విలన్ గా భూమిక మరో కీలక పాత్రలో నటిస్తున్న సవ్యసాచి నిర్మాత మైత్రి మూవీ మేకర్స్. రంగస్థలం తర్వాత ఆ బ్యానర్ లో వస్తున్న మూవీ ఇదే.

Loading...