నాని..ఇంద్రగంటి..సినిమా పేరు .. ‘వి’

నాచురల్ స్టార్ నాని జెర్సీ హిట్ తో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చాడు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నాని జెర్సీ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు నాని. ఆ సినిమా తర్వాత ఇంద్రంగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన అష్టా చెమ్మ, జెంటిల్ మెన్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాకు టైటిల్ గా వి అని పెట్టబోతున్నారట. సింగిల్ లెటర్ టైటిల్ తెలుగులో చాలా తక్కువ. అలాంటిది నాని ఈసారి సరికొత్తగా వి అనే టైటిల్ తో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వి అంటే విక్టరీ అనుకోవాలా లేక మరేంటో చూడాలి.

Loading...