నాని ‘గ్యాంగ్ లీడ‌ర్’ మూవీ రివ్యూ

నటీనటులు : నాని,కార్తికేయ, ప్రియాంకా అరుళ్ మోహన్,లక్ష్మీ, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్
దర్శకత్వం : విక్రమ్ కుమార్
నిర్మాత‌లు : నవీన్ ఎర్నేని, ఎర్నేని రవి మరియు మోహన్ చెరుకూరి
సంగీతం : అనిరుధ్ రవి చంద్రన్
సినిమాటోగ్రఫర్ : మీరోసలా క్యూబా బ్రోజెక్
ఎడిట‌ర్‌ : నవీన్ నూలి
విడుదల తేదీ : సెప్టెంబరు 13, 2019

నాచురల్ స్టార్ నాని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్‌ల కాంబినేష‌న్‌లో మైత్రి మూవీ మేక‌ర్స్ నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌ను తెర‌కెక్కించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 1100కుపైగా థియేట‌ర్స్‌లో రిలీజైన ఈ మూవీ ముందుగా ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోల‌ను పూర్తి చేసుకుంది. మ‌రి గ్యాంగ్ లీడ‌ర్‌ను నాచురల్ స్టార్ మ‌రిపించాడా..?

కథ :

ఒక ర‌చ‌యిత ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఐదుగురు ఆడవాళ్లు త‌మ లైఫ్‌లో జ‌రిగిన ఒక ఇన్సిడెంట్‌ను రైట‌ర్‌తో ఒక క‌థ రాయించుకుంటారు. ఆ క‌థ‌లో విల‌న్‌ల‌ను రైట‌ర్ ఎలా చిక్కుల్లో ప‌డేశాడో అదే విధంగా ఆ ఆడ‌వాళ్లు వెండితెర విల‌న్‌ల‌పై ప‌గ తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అది తెలుసుకున్న విల‌న్ ఏం చేశాడ‌న్న‌ది త‌రువాత క‌థ‌. హీరో వీళ్ల‌కు ఎలా స‌హాయం చేశాడ‌న్న‌ది ఓవ‌రాల్ స్టోరీ పాయింట్. ఇది మెయిన్ పాయింట్ అయినాకానీ సినిమాలో ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాని కామిక్ టైమ్ సినిమా మొత్తం ఆక‌ట్టుకోగా నానికి ధీటుగా ఆడ‌వాళ్లంద‌రి కామిక్ టైమ్‌తో ఆక‌ట్టుకున్నారు. చాలా వ‌ర‌కు స‌న్నివేశాలన్నీ హిలేరియస్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఫ‌స్టాఫ్ మొత్తం పాత్ర‌ల ప‌రిచ‌యాలు వాటి మ‌ధ్య కామెడీ సీన్స్‌తో న‌డ‌వ‌గా, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోయే రేంజ్‌లో ఉంది. ఇక అక్క‌డ్నుంచి సెకండాఫ్‌పై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోతాయి. సెకండాఫ్ కూడా చాలా వ‌ర‌కు అంచ‌నాల‌ను నిల‌బెట్టే విధంగా ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ స్లో అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. మొత్తం మీద నాని మ‌రోసారి బాక్సాఫీసు వ‌ద్ద త‌న‌మార్క్ చూపెట్టే విధంగా ఆకట్టుకున్నాడ‌నే చెప్పాలి.

ఇక న‌ట‌న ప‌రంగా నాని మ‌రోసారి త‌న కామెడీ టైమింగ్‌, అలాగే యాక్టింగ్‌తో దుమ్ములేప‌గా మిగిలిన వారంద‌రూ కూడా వారి వారి పాత్ర‌ల ప‌రిధిలో ఆక‌ట్టుకున్నారు. హీరో హీరోయిన్‌ల కెమిస్ట్రీ కూడా చాలా వ‌ర‌కు సెట్ అయింది. వెండితెర‌పై చూసేందుకు ఇద్ద‌రి పెయిర్ చాలా బాగుంది.

సంగీతం ప‌రంగా అనిరుథ్ పాట‌ల‌ను దుమ్మురేపాడు. అంత‌కు మించి అనే విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాలోని స‌న్నివేశాల‌ను చాలా వ‌ర‌కు ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ కొద్దిగా షార్ప్‌గా ఉండి, కొద్దిగా లెన్త్ త‌క్కువై ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే స‌న్నివేశాలు ఆ లెన్త్‌ను కూడా మైమ‌రిపించే విధంగా ఉన్నాయి.

తీర్పు :

ఇక డైరెక్ష‌న్ ప‌రంగా విక్రమ్ కే కుమార్ త‌నదైన ఆలోచ‌న‌తో స్క్రీన్ ప్లే, బేస్డ్ క‌థాంశంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను తిక‌మ‌క‌పెడుతూనే అల‌రించే స‌న్నివేశాలు రాసుకుని, అవి మెప్పించే విధంగా తెర‌కెక్కించాడు. ఏ మాత్రం వంక‌పెట్ట‌ని స్క్రీన్ ప్లేతో ఆక‌ట్టుకున్నాడ‌ని, విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నం, 24, 13 బీ సినిమాల‌ను గుర్తుచేసే స్క్రీన్ ప్లేతో గ్యాంగ్ లీడ‌ర్ క‌థ మొత్తం న‌డుస్తుంది.

మొత్తంగా క్లాస్ మూవీస్‌, డిఫ‌రెంట్ మూవీస్ కోసం ఎదురుచూసే వారికి ఈ మూవీ ఫుల్ మీల్స్‌గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడికి ఈ సినిమా బాగా న‌చ్చ‌డంతో ఇప్ప‌టికే హిట్ నుంచి సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. దీంతో నాచురల్ స్టార్ నాని బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న‌దైన మార్క్ స్టైల్లో దుమ్ములేపే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అలాగే, ఎంసీఏ త‌రువాత ఇంత వ‌ర‌కు 40 కోట్ల మార్క్ దాట‌ని నాని గ్యాంగ్ లీడ‌ర్‌తో ఈ ఫీట్‌ను అందుకుంటాడ‌న్న న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు తెలుస్తుంది. కృష్ణార్జున యుద్ధం, దేవ‌దాస్ ఫ్లాప్ త‌రువాత జెర్సీతో ఓకే అనిపించుకున్న నాని గ్యాంగ్ లీడ‌ర్‌తో గుర్తుండిపోయే స‌క్సెస్‌ను అందుకోనున్నాడ‌న్న టాక్ ఇప్ప‌టికే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Rating: 3/5

Loading...