ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్.. హైకోర్టును ఆశ్రయించాడు

హైదరాబాద్ నగర శివార్లలోని తన గెస్ట్ హౌజ్‌ను రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన కేసులో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఏకంగా గెస్ట్ హౌజ్ సీజ్ చేశారు అంటూ అధికారుల వైఖరిపై ప్రభాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ప్రభాస్ వేసిన పిటిషన్ ఇవాళ విచారణ జరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పైగాలో దాదాపు అర ఎకరంలో ప్రభాస్ నిర్మించుకున్న గెస్ట్‌హౌస్‌ స్థలం భూవివాదంలో వుండటంతో రెవెన్యూ అధికారులు దానిని సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Loading...