రాజశేఖరా ..ఇప్పుడీ సినిమా అవసరమా ?

కొన్ని సినిమాలు మొదలౌతాయి, షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటాయి. కానీ రీలు మాత్రం ల్యాబ్ కె పరిమితమైపోతుంటుంది. ఇలా డబ్బాలలో బూజు పట్టేసిన సినిమాలు వేలల్లో ఉంటాయి. చిన్న సినిమాలే కాదు .. కాస్త పేరున్న హీరోల సినిమాలు కూడా ల్యాబుల్లో మగ్గుతుంటాయి. అప్పుడప్పుడు వీటి బూజు దులిపి విడుదల ప్రకటన ఇస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ప్రకటన వచ్చింది.

రాజశేఖర్ హీరోగా అర్జున అనే సినిమా తెరకెక్కింది. కన్మణి ఈ సినిమాకి దర్శకుడు. తొమ్మిదేళ్ల క్రితం మాటిది. ఈ సినిమా ఏవో సమస్యలతో ల్యాబ్ లోనే వుండిపోయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మార్చి 15న రిలీజ్ అంటున్నారు.
మరి ఈ సినిమా రాజశేఖర్ కి ప్లస్సా మైనస్సా అంటే మైనస్సే అని చెప్పాలి.

‘గరుడవేగ’తో హిట్ కొట్టారు రాజశేఖర్. అదే జోరులో ఇప్పుడు కల్కి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. ఇలాంటి నేపధ్యంలో అర్జున లాంటి అవుట్ డేటెడ్ సినిమా ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Loading...