రామ్ కొత్త సినిమా ‘రెడ్‌’

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ఇటీవ‌ల పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఇక ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌తో రామ్ వ‌రుస పెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు టైటిల్‌తో స‌హా వ‌చ్చేసింది.

రామ్ కెరీర్‌లో 18వ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌గా రెడ్ అని ఫిక్స్ చేశారు. ఇంగ్లీషు అక్ష‌రాలు అయిన ఆర్ఈడీ పేరుతో ఈ సినిమా టైటిల్ లోగో డిజైన్ చేశారు. రామ్ పెద‌నాన్న అయిన ప్ర‌ముఖ నిర్మాత స్ర‌వంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మించారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించే ఈ సినిమాకు తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. వీరి కాంబోలో వ‌చ్చిన నేను శైల‌జ సినిమా హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం, స‌మీర్‌రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, పీట‌ర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేయ‌నున్నారు. ఏఆర్ ప్ర‌కాష్ ఆర్ట్ వ‌ర్క్‌, జునైద్ ఎడిటింగ్ అని పోస్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టుల‌తో పాటు మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Loading...