‘అల వైకుంఠపురములో’ సుశాంత్.. లుక్

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అల వైకుంటపురములో … గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ లుక్ ,సామజవరగమనా సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. అయితే ఈ చిత్రంలో మ‌రో హీరో కూడా న‌టిస్తున్నాడు. యువ హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ రిలీజ్ చేసింది.

‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ పాత్ర పేరు రాజ్. “రాజ్ నవ్వితే ఎలాంటివాళ్లయినా ఆకర్షితులవ్వాల్సిందే” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇందులో సుశాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సుశాంత్ అల్లు అర్జున్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా, నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. సీనియర్ నటి టబు దశాబ్దకాలం తర్వాత ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఇక‌ ఈ సినిమాని సంక్రాంతి సందర్బంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

Loading...