‘సైరా’ రివ్యూ

విడుదల తేదీ : అక్టోబర్ 02, 2019
నటీనటులు : చిరంజీవి, నయనతార,అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్,బ్రహ్మాజీ, బ్రహ్మానందం,నిహారిక తదితరులు.
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత‌లు : రామ్ చరణ్
సంగీతం :అమిత్ త్రివేది(సాంగ్స్) జూలియస్ పాకియం(బీజీఎమ్)
సినిమాటోగ్రఫర్ : ఆర్ రత్నవేలు
ఎడిట‌ర్‌ : శ్రీకర్ ప్రసాద్

మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తరువాత రెండేళ్లు కష్టపడి చేసిన సినిమా సైరా. రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. తొలి తెలుగు స్వాతంత్రయోధుడి పాత్రలో మెగాస్టార్ నటించారు. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.

కథ:

అది రాయలసీమలోని రేనాడు ప్రాంతం. అక్కడ 61 సంస్థానాలు. ఎవరికి వారే అనే రీతిలో పరిపాలన చేస్తుంటారు. ఎవరి మధ్య ఐక్యత లేకపోవడంతో నిజాం నవాబులు వారిని ఆక్రమించుకుంటారు. నిజాం నవాబులు శిస్తు కడుతూ పరిపాలన సాగిస్తున్న ఈ సంస్థానాల పన్నుల వసూలు విషయాలను బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది నిజాం ప్రభుత్వం. బ్రిటిష్ పాలకులు శిస్తు కోసం ప్రజలను హింసించడం మొదలుపెడతారు. ఒక సంస్థానానికి రాజైన సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేస్తాడు. ఐక్యంగా లేని 61 సంస్థానాలలో ఐక్యత తెచ్చి పోరాటం చేస్తాడు. చివరికి ఆ పోరాటం ఏమైంది..? చివరి వరకు ఐక్యంగా ఉన్నాయా..? బ్రిటిష్ దొరలపై ఎలాంటి పోరాటం చేశారు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా కథను రేనాడులో కాకుండా ఝాన్సీలో ప్రారంభం చేశారు. బ్రిటిష్ దొరలు ఝాన్సీపై దండెత్తుతారు. దీంతో ఝాన్సీ లక్ష్మీభాయ్ వారిని ఎదుర్కొంటుంది. అదే సమయంలో తన సైనికులకు బ్రిటిషర్లపై పోరాటం మొదలు పెట్టింది మనం కాదని, మొదట రేనాడు ప్రాంతంలో సైరా నరసింహారెడ్డి అనే వీరుడు బ్రిటీషర్లపై పోరాటం చేశారని అనుష్క చెప్పడంతో కథ రరేనాడు ప్రాంతానికి మారుతుంది.

61 చిన్న చిన్న సంస్థానాలు.. వాళ్ళ మధ్య గొడవలు.. ఐక్యమత్యం లోపించడం.. బ్రిటిష్ పాలకులు పన్నులు వసూలు చేయడానికి రావడం.. ప్రజలను హింసించడం వంటి విషయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ.. కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంటుంది. అప్పటి బ్రిటిష్ పాలకులు పన్నుల కోసం ప్రజలను ఎలా హింసించేవారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేయాలి అంటే ఒక్కొక్కరుగా పోరాటం చేస్తే కుదరదని, అందరు కలిసి కట్టుగా పోరాటం చేయాలి అని 61 సంస్థానాల మధ్య ఐక్యమత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు సైరా నరసింహారెడ్డి. అదే సమయంలో బ్రిటిష్ సైనికులతో ఒంటరిగా తన సైనికులతో పోరాటం చేస్తుంటాడు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకుని విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ సమయంలో బ్రిటిష్ అధికారిని చంపడంతో సెకండ్ హాఫ్ లో పై ఉత్కంఠత ఏర్పడుతుంది.

సెకండ్ హాఫ్ కథ గమన వేగం పెరుగుతుంది. బ్రిటిష్ అధికారిని హతమార్చిన విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అక్కడి పోరాటాన్ని అణిచివేసేందుకు అత్యంత క్రూరుడైన అధికారిని అక్కడికి పంపుతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలౌతుంది. ఒకవైపు సంస్థానాల మధ్య ఐక్యత తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తున్నాడు. మెగాస్టార్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పోరాట సన్నివేశాలు ఉండటం విశేషం. ఇక క్లైమాక్స్ లో సైరా చిన్న సైన్యం పదివేలమంది బ్రిటిష్ సైనికులను చంపడం అన్నది లాజిక్ కు దూరంగా ఉంది. క్లైమాక్స్ ను భావోద్వేగాలతో ముగించాడు.

నటీనటుల పనితీరు:

మెగాస్టార్ చిరంజీవి సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించాడు. యోధుడిగా మెగాస్టార్ చిరంజీవి నటన అమోఘం. ఇక గురువుగా గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర హుందాగా ఉన్నది. అవుకు రాజుగా సుదీప్, పాండిరాజాగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, బసిరెడ్డిగా రవికిషన్ , నయనతార, తమన్నా ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఇమిడిపోయి నటించారు.

సంకేతికవర్గం పనితీరు:

సైరా సాంకేతికంగా సూపర్ అని చెప్పాలి. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాను నడిపించిన తీరు బాగుంది. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉండే విధంగా చూసుకున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ వండర్ చేసింది. అమిత్ త్రివేది సంగీతం, జులియన్ నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి.

పాజిటివ్ పాయింట్స్:
నటీనటులు
మెగాస్టార్ నటన
వార్ ఎపిసోడ్స్
సాంకేతిక వర్గం పనితీరు

నెగెటివ్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో సాగతీత
లాజిక్ లేని పోరాటం

Rating : 3.25

Loading...