తేజస్వీ ‘కమిట్మెంట్’ వెబ్ సిరీస్

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-2 ద్వారా పాపులర్ అయిన నటి తేజస్వీ మదివాడ. ఈ అమ్మడు 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దర్శకుడు వర్మ తీసిన ఐస్ క్రీమ్‌తో ఆకర్షించే ప్రయత్నం చేసింది. సాధారణంగా సాగిపోతున్న ఆమె కెరీర్‌కు బిగ్ బాస్ తోడైంది. బిగ్ బాస్‌ 2లో గొడవలు, నోరు ఎక్కువ చేయడం వల్ల తేజస్వికే కాస్త నష్టం జరిగింది.

బిగ్ బాస్ 2 హౌస్ నుంచి బయటకొచ్చాక థాయ్‌లాండ్ వెళ్లి రిఫ్రెష్ అయి వచ్చిన తేజస్వీ ‘కమిట్మెంట్’ అనే ఓ బోల్డ్ కంటెంట్ సిరీస్‌లో నటిస్తోంది. మొత్తం నాలుగు పార్ట్‌లుగా ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నాడు. కమిట్మెంట్ సిరీస్ సినిమాల్లో తేజస్వీ బోల్డ్ సీన్లలో కనిపించనుంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ బోల్డ్ పోస్టర్‌ను కమింగ్ సూన్ (త్వరలో రాబోతోంది) క్యాప్షన్‌తో నటి తేజస్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెడ్ మీద ఆ పని చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Loading...