తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో నెలల రోజులుగా మర్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించగా…సభలు, ఊరేగింపులు, సినిమా థియేటర్లు..టీవీల ద్వారా ప్రచారంపై ఆంక్షలు విధించింది.

ఈసీ ఆదేశాల మేరకు అభ్యర్ధుల కూడా ఎన్నికల ప్రచారం ముగించేశారు. ఇనాళ్లు ఇంటింటి వెళ్ళి ఓట్లు అడిగిన నేతలు ఇప్పుడు తమ ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. అటు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటు ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో జాతీయ పార్టీల నేతలు సైతం పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో నేతలంతా తిరిగి పయనమయ్యారు.

పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి..అలాగే 11 న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్ లో అత్యధికంగా 3,873 ఏర్పాటు చేశారు. 1,60,509 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1821 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 ఓటర్లు ఓటు హక్కు వినియెగించుకోనున్నారు. ఈ సారి దివ్యాంగుల కూడా ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేశారు

భారీ భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 279 కంపెనీ బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి. మొత్తం 50 వేల రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దీనికి అదనంగా కేంద్ర బలగాలు 25 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల పర్యవేక్షణకు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి బలగాలను రప్పించారు

Loading...