తిప్పరా మీసం రివ్యూ

నటీనటులు : శ్రీవిష్ణు , నిక్కీ తంబోలి
సంగీతం : సురేష్ బొబ్బిలి
నిర్మాత : రిజ్వాన్
దర్శకత్వం : కృష్ణ విజయ్
విడుదల తేదీ : 8 నవంబర్ 2019

శ్రీ విష్ణు – నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తిప్పరా మీసం. ఈరోజు విడుదలైన తిప్పరా మీసం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

స్టోరీ :

చిన్నప్పటి నుండే తల్లి ని అమితంగా ద్వేషిస్తూ డ్రగ్స్ కి బానిస అవుతాడు మణిశంకర్ ( శ్రీవిష్ణు ). పెరిగి పెద్దయ్యాక డీజే గా పనిచేస్తూ ఉంటాడు మణి. అయితే డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ సమస్యల్లో చిక్కుకుంటాడు మణిశంకర్. అసలు మణిశంకర్ తల్లిని ఎందుకు ద్వేషిస్తున్నాడు ? సమస్యల్లో చిక్కుకున్న మని ఎలా బయటపడ్డాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

శ్రీవిష్ణు
ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్

డ్రా బ్యాక్స్ :
నిడివి
ఫస్టాఫ్ లో సాగతీత
కథనం

పెర్ఫార్మెన్స్ :

శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తున్న శ్రీవిష్ణు మరోసారి కొత్తగా ట్రై చేసిన చిత్రం ఈ తిప్పరా మీసం. ఇక శ్రీవిష్ణు తర్వాత అంతటి ప్రాధాన్యత రోహిణి పాత్రకు లభించింది. తల్లి పాత్రలో రోహిణి నటన అద్భుతం అనే చెప్పాలి . నిక్కీ తంబోలి అందాలను ఆరబోయడమే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీమ్ :

అద్భుతమైన విజువల్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగున్నాయి అయితే అంతకంటే ఎక్కువగా నేపథ్య సంగీతంతో అలరించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే ఎడిటింగ్ పరంగా ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. దర్శకులు కృష్ణ విజయ్ పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. మంచి కథ ని ఎంచుకున్నప్పటికీ దాన్ని సరైన దిశలో రాసుకోలేకపోయాడు అలాగే తీయలేకపోయాడు.

రేటింగ్ : 2.5/ 5

Loading...