దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహ వేడుక..

ప్రస్తుతం చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు రాజస్థాన్‌ లోని జైపూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. జైపూర్‌లో జరుగుతోన్న ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహ వేడుకల్లో వీరంతా పాల్గొంటున్నారు. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు, రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నారు. తాము పెళ్లి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను తాజాగా ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు. నూతన దంపతులు ఆశ్రిత, వినాయక్ రెడ్డితో కలిసి రామ్ చరణ్, ఉపాసన ఫొటో దిగారు. ఈ ఫొటోలో వెంకటేష్, ఆయన సతీమణి నీరజ కూడా ఉన్నారు. ‘వెంకీ అంకుల్, నీరూ ఆంటీ, ఆశ్రిత, వినాయక్‌కు అభినందనలు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అని ఫొటోలను షేర్ చేస్తూ తన ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నారు.

ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, రెండు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో గత కొంతకాలంగా ఆశ్రిత ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించారు. ఫిబ్రవరి నెలలో అశ్రిత, వినాయక్ నిశ్చితార్థం జరిగింది. మణికొండలోని వరుడి ఇంట్లో ఈ నిశ్చితార్థాన్ని నిర్వహించారు. ఈరోజు ఉదయం వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.

Loading...