‘వెంకీ మామ‌’ రివ్యూ

బ్యాన‌ర్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి
ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర (బాబి)
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 149 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 13 డిసెంబ‌ర్‌, 2019

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది.

కథ:

రామనారాయణ (నాజర్‌) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్‌) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్‌ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్‌.. కార్తీక్‌ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్‌ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్‌ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్‌కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ.

విశ్లేషణ:

మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్‌ అంతా కామెడీతో ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్‌ అలాగే అనుకోవడం, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్‌ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్‌, బ్రేకప్‌ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్‌ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్‌ కొట్టకపోయినా.. సెకండాఫ్‌లో కొంత లాజిక్‌ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్‌ కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్‌ క్లైమాక్స్‌ ఇవన్ని రోటిన్‌ ఫీలింగ్‌ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది.

ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్‌కు తీసుకెళ్లి.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి సీన్లతో కొంత లాజిక్‌ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్‌ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్‌ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్‌… నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్‌ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు.

ప్లస్ పాయింట్స్:

వెంకటేశ్‌, నాగచైతన్య నటన
ఫస్టాప్‌, కామెడీ
సినిమా నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:

సెకండాఫ్‌ ఒకింత రోటిన్‌గా అనిపించడం
సినిమాటిక్‌ క్లైమాక్స్‌

వెంకీ మామ రేటింగ్‌: 2.5 / 5

Loading...