ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే సరిగ్గా మధ్యాహ్నం 12. 23 గంటలకు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.

వైఎస్ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అభినందించారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైసీపీ నేతలు పోటీపడ్డారు.

Loading...